యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాని తన అందంతో కట్టి పడేస్తుంది. సినిమాల్లో తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రీలీల, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఒకేసారి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. పంజా వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి అందుకే ఆదికేశవ పోస్టర్స్ అండ్ డాన్స్ బిట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీల నుంచి రానున్న మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ త్వరలో బయటకి రానుంది, ఒక మాస్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ కూడా రివీల్ అవ్వాల్సి ఉంది.
Read Also: Raviteja: క్రాకింగ్ కాంబినేషన్ కి బడ్జట్ కష్టాలా?
ఈ రెండు సినిమాల అప్డేట్స్ కారణంగా శ్రీలీల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇవి చాలవన్నట్లు శ్రీలీల లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ కూడా బయటకి వచ్చి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జనవరి వరకూ శ్రీలీల నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న గుంటూరు కారం సినిమా శ్రీలీల కెరీర్ ఫేట్ ని కంప్లీట్ గా మార్చేసే ప్రాజెక్ట్. మహేష్-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి గుంటూరు కారం సినిమా సాలిడ్ హిట్ అయితే శ్రీలీల ఇక స్టార్ హీరోస్ అందరి పక్కన ఒక రౌండ్ వేసేయడం గ్యారెంటీ.