దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో అంటూ పుష్ప తో చిందులేసి బీటౌన్ చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో కేక పుట్టించిన అమ్మడికి నార్త్ బెల్ట్ భారీ లెవల్లో అటెన్షన్ ఇచ్చింది. దీంతో ఆఫర్లను పిలిచి ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో మెడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగర్గ ఫోటోలకు ఫోజులిచ్చి బీటౌన్ ఎంట్రీకి రెడీ అయ్యినట్లు హింట్ ఇచ్చింది భామ. కానీ ఇబ్రహీంతో కాకుండా కార్తీక్ ఆర్యన్‌తో సినిమా సెట్ చేసుకుంది.
Also Read : RT 75 : రవితేజ.. BVSరవి.. కిషోర్ తిరుమల.. కాంబోలో సినిమా ఫిక్స్..
భూల్ భూలయ్యా3 భారీ హిట్ తర్వాత అనురాగ్ బసు దర్శకత్వంలో మూవీకి కమిటయ్యాడు కార్తీక్ ఆర్యన్. ఇందులోనే శ్రీలీల హీరోయిన్ గా కన్ఫమ్ అయ్యింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిస్తోంది టీ సిరీస్. ఈ ఏడాది దివాలీకి సినిమాను తీసుకు రాబోతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ మరోసారి ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వస్తున్నాయి. సారా అలీఖాన్‌తో బ్రేకప్ తర్వాత సింగిల్‌గా ఉన్న ఈ స్టార్ హీరో రీసెంట్లీ శ్రీలీలతో మింగిల్ అయ్యాడని బాలీవుడ్ మీడియా అంటోంది. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ రిలీజైన నాటి నుండి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. కాగా రీసెంట్లీ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల కనిపించే సరికి ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ పార్టీలో శ్రీలీల డ్యాన్సులేయడం, కార్తీక్ తన ఫోనులో ఆమెను క్యాప్చర్ చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఆ రూమర్లకు బలాన్ని ఇచ్చినట్లయ్యింది. మరి ఈ రూమర్లకు శ్రీలీల చెక్ పెడుతుందో లేదో.