OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OM Pre Release Event: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది. కెరీర్ తొలినాళ్లలో కథలు ఎంచుకునే అవకాశం లేక వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్లిపోయానని, కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకుని సొంత నిర్ణయాలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టానని స్పష్టం చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓం’ (O.M). నవంబర్ 20న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో శ్రీలీల తన మనసులోని మాటలను బయటపెట్టింది.
తన మెడిసిన్ ఇంటర్న్‌షిప్ కోసం ముంబైలో ఉన్న సమయంలో ‘ఓం’ కథ విన్నానని శ్రీలీల తెలిపింది. “చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి అప్పట్లో నాకు కథలు ఎంచుకునే పొజిషన్ లేదు. ఏది వస్తే అది చేసుకుంటూ ఫ్లోలో వెళ్లిపోయాను. అయినా మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపించి ఆదరించారు. కానీ కొంతకాలం తర్వాత నేను ఎక్కడ తప్పులు చేస్తున్నాను, నాలో నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచించుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే ‘మనం సొంతంగా నిర్ణయాలు తీసుకుని, కథలు ఎంచుకోవడం మొదలుపెట్టినప్పుడే జీవితం మారుతుంది’ అని ఒకరు చెప్పారు. అప్పుడే దర్శకుడు రాజ్‌కుమార్ గారు ఈ కథ చెప్పారు. ఇందులో పాటలు ఉండవని ఆయన చెప్పగానే నాకు చాలా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా అనిపించింది. నన్ను ఒక కొత్త కోణంలో చూపిస్తూ ఈ పాత్ర ఇచ్చారు” అంటూ తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి వివరించింది.
Also Read
సాయి పల్లవి గురించి మాట్లాడుతూ శ్రీలీల ఒక ఆసక్తికర జ్ఞాపకాన్ని పంచుకుంది. “నేను మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో ‘ఫిదా’ సినిమా రిలీజ్ అయింది. ఒక డాక్టర్ అమ్మాయి హీరోయిన్గా నటించిందనే విషయం అప్పట్లో మా ఇంట్లో వాళ్లందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు నేను డాక్టర్ డిగ్రీ పూర్తి చేసుకుని, మీతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మీరు ‘నిత్య రెడ్డి’ అనే తెలుగు అమ్మాయిగా, నేను తమిళ అమ్మాయిగా నటించడం భలే ఎగ్జైటింగ్‌గా ఉంది. పైగా ఇందులో మీరు యాక్షన్ కూడా చేశారు” అంటూ సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించింది.
సెట్లో రేణు దేశాయ్ బుర్ర బాగా తినేదాన్నని శ్రీలీల సరదాగా చెప్పింది. “షాపింగ్ మాల్లో మేమిద్దరం చేసిన షూటింగ్ సూపర్ ఫన్‌గా సాగింది. ఆవిడకు 20 ఏళ్ల వయసున్నప్పటి ఫోటో చూస్తే ఇప్పటికీ అసలు తేడా కనిపించదు. నిజంగానే అప్పుడు కూడా ఇలాగే ఉన్నారా అని నేను ప్రూఫ్ అడిగితే ఫోటో చూపించారు” అంటూ నవ్వులు పూయించింది. ఇక ధనుష్ సినిమాల్లో నటిస్తే ఏ ఆర్టిస్ట్ అయినా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారని, ఆయన కొడుకుల్ని కూడా అప్పుడప్పుడు తెలుగు ఈవెంట్లకు తీసుకురావాలని కోరింది. మెగాస్టార్ మమ్ముట్టి ఎంత పెద్ద ప్రశ్నకైనా ఒక్క ముక్కలో సమాధానం చెబుతారని, ఈ సినిమాలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కొనియాడింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నుంచి డిగ్రీ చేతికి వచ్చేవరకు తనకు అండగా నిలిచిన ప్రేక్షకులు, ఇప్పుడు తాను తీసుకుంటున్న కొత్త నిర్ణయాలకు కూడా తోడుంటారని ఆశిస్తున్నట్లు శ్రీలీల చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!