ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 28న స్కంద సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీలీల, కెరీర్ లో యావరేజ్ సినిమాని ఫేస్ చేసింది. ఈ సినిమా శ్రీలీలా మార్కెట్ ని ఇంచు కూడా డ్యామేజ్ చేయలేదు. స్కందని మరిపిస్తూ దసరాకి భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల.
Read Also: Balaiah: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి
సూపర్ డాన్సర్, మంచి గ్లామర్ అని పేరు తెచ్చుకున్న శ్రీలీలా మొదటిసారి భగవంత్ కేసరి సినిమాతో టెర్రిఫిక్ పెర్ఫార్మర్ గా కూడా పేరు తెచ్చుకుంది. భగవంత్ కేసరి దెబ్బకి శ్రీలీల క్రేజ్ కంప్లీట్ గా మారిపోయింది. నటిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవడం శ్రీలీలకి ఇప్పుడు యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా వస్తాయి. భగవంత్ కేసరి తర్వాత నెలకో సినిమా శ్రీలీల నుంచి వస్తుంది. నవంబర్ 24న వైష్ణవ్ తేజ్ తో నటిస్తున్న ఆదికేశవ, డిసెంబర్ 8న నితిన్ తో చేసిన ఎక్స్‌ట్రా ఆర్టిడినరీ మెన్… జనవరి 12న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాతో శ్రీలీల ఆడియన్స్ ముందుకి రానుంది. గుంటూరు కారం సినిమా రిలీజ్ అయితే శ్రీలీల టాప్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ. ఇలా నెలకో సినిమాతో శ్రీలీల బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉంది.