Sree Gowri Priya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!

Sree Gowri Priya

Sree Gowri Priya

Sree Gowri Priya: ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తెలుగమ్మాయి హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలో తన నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని, ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు తన పాత్రను ఎంతో ఆప్యాయంగా స్వీకరించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. “థియేటర్ విజిట్స్‌కు వెళ్లిన ప్రతిసారి ‘నీవి’ పాత్ర గురించి ప్రేక్షకులు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని చెప్పారు.

నటన కోసం ఎలాంటి యాక్టింగ్ స్కూల్‌ లేదా ప్రత్యేక శిక్షణ తీసుకోలేదని స్పష్టం చేసిన శ్రీ గౌరీ ప్రియ, భావోద్వేగ సన్నివేశాల్లో తన నుదిటి మీద నరం బయటకు కనిపించడం గురించి కూడా ఆసక్తికర విషయం వెల్లడించారు. “నాకు కోపం వచ్చినా, బాధ కలిగినా, ఎక్కువ ఆనందం వచ్చినా నుదిటి మీద నరం బయటకు కనిపిస్తుంది. నా స్నేహితులు దానికి ‘నర్వ్ గాడు’ అని సరదాగా పేరు కూడా పెట్టారు. ఆ నరం కనిపించగానే నేను కోపంగా ఉన్నానా, బాధలో ఉన్నానా అనేది వాళ్లకు వెంటనే అర్థమైపోతుంది” అని నవ్వుతూ చెప్పారు. అలాగే ఎమోషనల్ సీన్స్‌లో నిజంగా ఆ భావాన్ని అనుభూతి చెందితేనే అలాంటి సహజమైన ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయని, తాను పాత్రలో పూర్తిగా లీనమవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.