మార్వెల్ కామిక్స్ అభిమానులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ నెల 16వ తేదీ థియేటర్లలోనూ సందడి చేయబోతున్నాడు. తాజా సీరిస్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు మొదలైంది. ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రెండు గంటల్లో ఐదువేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడయ్యానని చెబుతున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోం’ విడుదల కాబోతోంది. గతంలో వచ్చిన ఈ సీరిస్ చిత్రాలకు భిన్నంగా ఇది ఉండబోతోందనే ప్రచారం బాగా జరుగుతోంది. ప్రపంచానికి తానెవరో తెలిసిపోవడంతో చిక్కుల్లో పడ్డ స్పైడర్ మ్యాన్… డాక్టర్ స్ట్రేంజ్ సహాయం తీసుకుంటాడట. ఇందులో ఏకంగా ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ నలుగురు విలన్లతో పోరాడతారని అంటున్నారు. అంతకు మించి అన్నట్టుగా ఉండబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందో తెలియాలంటే… మరో ఆరు రోజులు వేచి ఉండాల్సిందే!