Srinu Vaitla: మళ్ళీ శ్రీను వైట్ల మ్యాజిక్ సాగేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
24th September is director Srinu White’s birthday: కామెడీతో కబడ్డీ ఆడేస్తూ, యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకుంటూ, సెంటిమెంట్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ పలు ఫీట్లు చేశారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంటే షడ్రుచోపేత భోజనంతో సమానం అనుకోవాల్సిందే! అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో శ్రీనువైట్ల తన చిత్రాలను తెరకెక్కించి అలరించేవారు. జయాపజయాలు దైవాధీనం అన్నట్టుగా ఆయన అనూహ్య విజయాలనూ చూశారు. కొన్ని పరాజయాలతోనూ పయనించారు. అయినా ఈ నాటికీ జనం శ్రీను వైట్ల సినిమా అంటే నవరసభరితంగా ఉంటుందని భావిస్తూనే ఉన్నారు. శ్రీను వైట్ల మాత్రం అదుగో ఇదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప మరో సినిమాతో మురిపించడం లేదు.
శ్రీను వైట్ల 1972 సెప్టెంబర్ 24న తూర్పు గోదావరి జిల్లా కందుల పాలెంలో జన్మించారు. కొందరు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన శ్రీను వైట్ల తొలుత రాజశేఖర్ హీరోగా `అపరిచితుడు` అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అయితే అనుకోని కారణాల వల్ల ‘అపరిచితుడు’ ప్రేక్షకులకు పరిచయం కాకుండానే పోయాడు. తరువాత రవితేజ హీరోగా `నీ కోసం` చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విడుదల కోసం పలు పాట్లు పడ్డారు. ఉషాకిరణ్ సంస్థ `నీ కోసం`ను జనం ముందు నిలిపింది. దాంతో శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ ఏమిటో జనానికి తెలిసింది. తరువాత ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన `ఆనందం`తో భలేగా ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. రవితేజ `వెంకీ`లో శ్రీను వైట్ల కామెడీతో జనం కడుపులు చెక్కలు చేశారు. యాక్షన్, థ్రిల్స్ తోనూ మురిపించారు.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
చిరంజీవితో శ్రీను వైట్ల తెరకెక్కించిన `అందరివాడు` ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. శ్రీను పని అయిపోయిందని చాలామంది భావించారు. ఆ సమయంలో `ఢీ`తో బాక్సాఫీస్ ను ఢీడిక్కిలాడించారు. ఆ తరువాత `రెడీ`తో రామ్ కు మరపురాని విజయం అందించారు. “దుబాయ్ శీను, నమో వెంకటేశ, కింగ్“ చిత్రాలలో శ్రీను పూయించిన నవ్వులను ఇప్పటికీ జనం ఏరుకుంటూనే ఉన్నారు. మహేశ్ బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన తొలి చిత్రం `దూకుడు` బాక్సాఫీస్ వద్ద నిజంగానే దూకుడు చూపింది. ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల రేంజ్ మారిపోయింది. ఆ తరువాత శ్రీను దర్శకత్వంలో “బాద్ షా, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ“ రూపొందినా, మళ్ళీ `దూకుడు` నాటి మ్యాజిక్ సాగలేదు. ‘ఢీ’కి సీక్వెల్ రూపొందిస్తామని కొన్నేళ్ళ క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు అది రూపు దాల్చలేదు. 2018 నవంబర్ 16న శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోని’ విడుదలయింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా శ్రీను వైట్ల చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ఆయన నుండి మరో నవ్వుల తేరు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!