సినిమా షూటింగ్ విషయంలో ఎంత టెక్నాలజీ వచ్చిన పూర్తి న్యాచురాలిటీని తీసుకురావడం చాలా కష్టం.. ప్రస్తుతం గ్రాఫిక్స్ గిమ్మిక్కులు ఏలుతున్న కాలంలో సినిమా ఫ్రేమ్ లో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. దీనికితోను కరోనా పరిస్థితులు కూడా సినిమా షూటింగ్స్ లొకేషన్స్ ను తారుమారు చేశారు. విదేశాలకు ప్లాన్ చేసిన.. పరిస్థితుల ప్రభావంతో దాదాపు ఆర్టిఫిషియల్ గా వేసిన సెట్స్ లోనే షూటింగ్స్ జరుగుతున్నాయి.
ఇక నార్త్, సౌత్ సినిమాల షూటింగులకు సంబంధించి జమ్మూ-కాశ్మీర్ అందాల గూర్చి తెలియంది కాదు, కనీసం ఓ పాటలోనైన అక్కడి అందాలను చూపించాలనుకుంటారు. ఎందరో దర్శకులు కాశ్మీర్ హిమాలయాల అందాలను ఎంతో గొప్పగా చూపించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ ఏర్పడిన పరిస్థితుల కారణంగా సినిమా షూటింగులకు ఎంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోండటంతో యధావిథిగా చిత్రబృందాలు పర్యటిస్తున్నాయి.
Read Also: హృదయం బ్రద్ధలైందంటున్న అడివి శేష్!
ఇదిలావుంటే, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలీబన్స్ రాజ్యంగా మారడంతో పెద్ద సంక్షోభమే నెలకొంది. ఎప్పుడు, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇక అక్కడి పరిస్థితులను గమనిస్తున్న మన సినీ స్టార్స్ స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా లొకేషన్స్ లో, అక్కడి వాళ్ళతో మమేకమైన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1992 లో నటించిన సినిమా తాలూకు జ్ఞాపకాలను పోస్ట్ చేయగా, హేమా మాలిని తాను నటించిన ‘ధర్మాత్మా’ చిత్రం నుంచి అలనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకుంది. ప్రస్తుత సంక్షోభం నుంచి అక్కడి ప్రజలు బయటపడాలని వారు కోరుకుంటున్నారు.
కాగా, ఇదివరకు అక్కడి ప్రాంతాలను తెరపై చాలా సినిమాల్లో చూశాం. మరి ముఖ్యంగా విదేశీదాడులు, తీవ్రవాద కార్యకలాపాలకు సంబందించిన కంటెంట్ సినిమా లొకేషన్లకు ఆఫ్ఘనిస్తాన్ దేశం చాలా అనువైన ప్రదేశం. ఎంత రిస్క్ అయిన మన సినిమా వాళ్ళు అక్కడ షూటింగ్స్ చేయడానికి ఇష్టపడుతారు. ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక కట్టడాలు చూస్తే మిగితా సెట్టింగ్స్ ఏమాత్రం అవసరంలేనంత అందంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అఫ్ఘాన్ అందాలను కొన్ని ఏళ్ల పాటు తెరపై చూడలేమనే సందేశం కలుగుతోంది. ప్రస్తుతం తాలీబన్లు శాంతించినట్లే కనిపిస్తోన్న వాళ్ళను నమ్మలేని పరిస్థితి.. మన సినిమా వాళ్ళు కూడా ఇప్పట్లో అంత సాహసం చేయకపోవచ్చు.

