NTV Telugu Site icon

Sonam Kapoor: థియేటర్‌లో ఓ వ్యక్తి అక్కడ చేతులు వేశాడు.. భయంతో ఏడ్చేశా

Sonam Kapoor

Sonam Kapoor

Sonam Kapoor Revealed Being Molested In Movie Theatre: సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, ఇతర భామలకు ఏదో ఒక సమయంలో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. చివరికి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లు కూడా వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా అలాంటి సందర్భాన్ని రివీల్ చేసి, అందరినీ షాక్‌కు గురి చేసింది. తన స్నేహితులతో కలిసి తాను థియేటర్‌కి వెళ్లినప్పుడు, ఓ వ్యక్తి వెనక నుంచి తన బ్రెస్ట్‌ని టచ్ చేశాడని కుండబద్దలు కొట్టింది. ఆ ఘటనతో తాను భయపడిపోయానని, ఏం చేయాలో తెలీక ఏడుస్తూ కుర్చున్నానని చెప్పింది. ఓ ఇంటరాక్షన్‌లో భాగంగా సోనమ్ ఈ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.

Student Suicide: కృష్ణా జిల్లాలో యువతి ఆత్మహత్య.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్

సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. ఓ సినిమా చూసేందుకు నేను నా స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌కి వెళ్లా. ఇంటర్వెల్ తర్వాత స్నాక్స్ తీసుకోవడం కోసం బయటకు వచ్చా. అప్పుడు ఓ వ్యక్తి వెనక నుంచి వచ్చి, నా బ్రెస్ట్‌ని టచ్ చేశాడు. ఊహించని ఆ సంఘటనతో నేను ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకర్థం కాలేదు. ఆ షాక్‍తో అక్కడే కూర్చుని ఏడ్చేశా’’ అని తెలిపింది. అయితే.. ఈ సంఘటన గురించి తాను ఎక్కడా నోరు విప్పలేదని చెప్పింది. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. ఇలాంటి సంఘటనలు, లైంగిక వేధింపుల గురించి మహిళలు నోరు విప్పాల్సిన అవసరం ఉందని ఆమె సూచించింది.

Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ

ఇదిలావుండగా.. ఒక స్టార్ వారసురాలిని అయినప్పటికీ, తాను ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కున్నానంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ గతంలో బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. కొంతమంది దర్శకులు, నిర్మాతలు తన పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని.. తాను కాస్టింగ్ కౌచ్‌కు లొంగనని పలువురు ప్రముఖులకు చెప్పిన ఆడియో ప్రూఫ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తాను కాస్టింగ్ కౌచ్‌కు నేను నో చెప్పినందుకు.. కొందరు తనపై నిషేధం కూడా విధించారని పేర్కొంది. అయితే.. ఆ సవాళ్లను ఎదుర్కొని తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ల సంగతేంటో?

Show comments