ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమ ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక దీంతో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో అందరు కనిపిస్తున్నారు కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మిస్ అయ్యారని నెటిజన్స్ గమనించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ అనే ప్రశ్న వైరల్ గా మారింది. రాజమౌళి తండ్రి, రైటర్ విజయ్న్ద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినన అవసరం లేదు. ఆయన రాసే కథలు చరిత్రలు సృష్టిస్తాయి. తండ్రి సపోర్ట్ లేనిదే జక్కన్న ఇంతవరకు వచ్చేవాడు కాదు అన్నది చెప్పుకోదగ్గ విషయం.
మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ పై హైప్ రావడానికి కారణం ఆయనే అని చెప్పాలి. పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ సినిమా గురించి మాట్లాడిన మాటలే ఎంతోమందికి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొనేలా చేశాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రమోషన్స్ లో కనిపించకపోవడం ఏంటి అనేది నెటిజన్ల సందేహం. మొన్నటికి మొన్న చిక్ బళ్లాపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా విజయేంద్ర ప్రసాద్ హాజరు కాలేదు. గత కొద్దిరోజుల నుంచి ఆయన ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియలేదు. ఇక ఇటీవలే ఆయన కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా విజయేంద్ర ప్రసాద్ మాటలను మిస్ అవుతున్నామని, ఆయన కూడా ప్రమోషన్స్ లి ఉంటే బావుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.