Sobhita Post on Her Sister Samantha Goes Viral: నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు. తెలుగులో ఆలాగే తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు చేసింది. వాటిలో కొన్ని బాగా ఆడాయి కూడా. ఆ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువగా ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె అనూహ్యంగా వార్తల్లోకి వస్తోంది. శోభితతో నాగ చైతన్య గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి, అయితే వారు స్వయంగా గత వారం అధికారికంగా ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య గత వారం శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
Venu Swami Wife: భర్తకి మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య
శోభిత – నాగ చైతన్యల వివాహ నిశ్చితార్థానికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. వీరి ప్రేమ వివాహానికి అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు సోబిత పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె తన సోదరి సమంతను గురించి చేసిన అకామెంట్లు వైరల్ అవుతున్నాయి. నా తల్లితండ్రుల పట్ల నాకున్న ప్రేమను తెలియజేసేందుకు ఎన్ని జన్మలెత్తినా మా నాన్న, అమ్మ నాకు తల్లిదండ్రులు కావాలని నా కోరిక. నాకు ఇంకేమీ అవసరం లేదు. నా సోదరి సమంత కుక్కలా పుట్టినా ఫర్వాలేదు’’ అని ఒక పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సమంతను కుక్కలా పుట్టమని చెప్పిందంటూ కామెంట్ చేస్తున్నారు. శోభితకు సమంత అనే సోదరి ఉంది. సమంతకి ఇప్పటికే పెళ్లి అయింది. శోభిత తన సోదరి గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.