బిగ్ బాస్ సీజన్ 6 రెండో రోజునే కథ రంజుగా రక్తి కట్టడం మొదలైంది. గీతూ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక బిగ్ బాస్ ఆమెను నామినేట్ చేసేస్తాడని అంతా అనుకుంటుంటే అందుకు భిన్నంగా జరిగింది. అలానే బిగ్ బాస్ హౌస్ లో నటుడు బాలాదిత్య పెద్దన్న పాత్ర పోషించి, అందరికీ తలలో నాలుకగా మెలుగుతుంటే… అతనికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. క్లాస్, మాస్, ట్రాష్ గేమ్ ను పూర్తి చేసే సమయానికి బిగ్ బాస్ గీతూ రాయల్, ఆదిరెడ్డి, నేహా చౌదరి ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యారని ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తండ్రిని తలుచుకుని కన్నీటి పర్యంతమైన ఇనయా రెహ్మాన్ డైరెక్ట్ గా ఈ వారం నామినేట్ అయిపోయింది.
అంతేకాదు… ఆమెతో పాటే ట్రాష్ టీమ్ లో ఉన్న బాలాదిత్య, ఐటమ్ గర్ల్ అభినయశ్రీ కూడా డైరెక్ట్ నామినేషన్స్ జాబితాలోకి చేరిపోయారు. వీరికి తోడుగా ఇంకా ఎవరినైనా బిగ్ బాస్ నామినేట్ చేస్తాడో చూడాలి. ఒకవేళ ఈ వారానికి ఈ ముగ్గురే నామినేషన్స్ లో ఉంటే మాత్రం బాలాదిత్య, అభినయశ్రీ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే జరిగితే ఇనయా రెహ్మాన్ బయటకు వచ్చేయడం ఖాయం… బట్ కనీసం పదిమందినైనా బిగ్ బాస్ తొలివారం నామినేట్ చేస్తుంటాడు కాబట్టి… ఆ లిస్ట్ లోకి ఎవరెవరు చేరతారో వేచి చూడాలి.