Snigdha Reveals she was molested by a stranger: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క యూట్యూబ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ఇంటర్వ్యూలను దావత్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు గెస్టులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు అవ్వగా తాజాగా టామ్ బాయ్ లాగానే కనిపించే సింగర్, నటి అయిన స్నిగ్ధ ఈ ఇంటర్వ్యూకి హాజరైంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో కొన్ని సంచలన విషయాలు ఆమె బయట పెట్టింది. తనమీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న ఆమె ఒకరకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది.
Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
అంతేకాదు ఈ రేప్ అట్టెంప్ట్ జరిగిన తర్వాత తన తండ్రి పక్కన పడుకోవాలి అన్న భయం వేసేదని, రాత్రి నిద్ర కూడా పట్టేది కాదని పేర్కొంది. తండ్రి మాత్రమే కాదు మామ లేదా బాబాయి పక్కన పడుకోవాలన్నా ఒక రకమైన అనుమానం కలిగేదని చెప్పుకొచ్చింది. వాళ్లు గతంలో లాగానే నన్ను బుజ్జగించే వాళ్ళు కానీ వీళ్లు బ్యాడ్ టచ్ చేస్తున్నారా? గుడ్ టచ్ చేస్తున్నారా? అని తనకు అనుమానం కలిగేదని ఆమె చెప్పుకొచ్చింది. తన జీవితంలో మరిచిపోలేని రిగ్రెట్ తన తల్లి విషయంలోనే ఉందని ఆమె ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వీకెండ్ కి వెళ్లడానికి రెడీ అయ్యాను. శనివారం నాడు నేను టికెట్ బుక్ చేసుకుంటే ఆమె మాత్రం గురువారం నాడే చనిపోయింది. ఎంత బిజీగా ఉన్నా ఆమె పిలిచింది కాబట్టి వెళ్లి ఉంటే ఆమెను బ్రతికి ఉండగా చివరి చూపు చూసుకునే దాన్ని, నేను శనివారం నాడు వెళ్ళాలి అనుకోవడం వల్ల ఆమెను చూసుకోలేకపోయాను అది నా జీవితంలో అతిపెద్ద రిగ్రెట్ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.