ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 6 సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి, దసరా సందర్భంగా అనేక భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు డిసెంబర్లో స్టార్ హీరోలు నటించే సినిమాలు విడుదల కోసం లైన్లో ఉన్నాయి. ఇంతలో చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ శుక్రవారం సినిమాలను విడుదల చేశారు. నవంబర్ 19న వెండితెర, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై దాదాపు 6 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నవంబర్ 19న థియేటర్లలో, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కనీసం 10 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మిస్సింగ్, మిస్టర్ లోన్లీ, స్ట్రీట్ లైట్ ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల్లో ఉన్నాయి.
Read also : వర్షంలోనూ తగ్గని ‘పెద్దన్న’ జోరు
Also Read
- Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
- Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
- January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
- Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
అద్భుతం : ఫాంటసీ రొమాంటిక్ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. తేజ సజ్జ, శివాని రాజశేఖర్ ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్‌గా ప్రేమించుకునే పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
సావిత్రి w/o సత్యమూర్తి : చైతన్య కొండ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రంలో ఒక యువకుడు తన కంటే కనీసం 35 ఏళ్లు పెద్దదైన స్త్రీని వివాహం చేసుకుంటాడు. తప్పిపోయిన తన భర్తను కనుగొనడానికి సావిత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది ? అనే తన భర్తను ఎలా పట్టుకుంటుంది ? అనేది మిగతా కథ. నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
రామ్ అసుర్ : అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందిని తమిళ్ అరసన్, షానీ సల్మాన్, షెర్రీ అగర్వాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ అసుర్ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహించారు. ASP మీడియా, జీవీ ఐడియాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ముందుగా ‘పీనట్ డైమండ్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ప్రత్యేకమైన కథాంశంతో రూపొందిందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
ఊరికి ఉత్తరాన : ముప్ఫై ఏళ్ల మధ్య వయసున్న పెళ్లి కాని వ్యక్తి పడే కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. నరేన్ వనపర్తి, దీపాలీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వనపర్తి వెంకటయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పోస్టర్ : నవంబర్ 19న ప్రీమియర్ అవుతున్న చిన్న బడ్జెట్ చిత్రాలన్నింటిలో ఈ చిత్రం అతి పెద్ద చిత్రం. ఫిల్మ్ పోస్టర్‌కి టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాహి సింగ్, అక్షతా సోనావానే, విజయ్ ధరన్ ప్రధాన పాత్రలు పోషించారు.
రావణ లంక : క్రిష్ బడిపల్లి, అస్మిత కౌర్ నటించిన ‘రావణ లంక’ నవంబర్ 19 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మురళీ శర్మ, దేవ్‌గిల్, రచ్చ రవి కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ‘రావణ లంక’కు బీఎన్ఎస్ రాజు దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాలతో పాటు అక్కినేని అఖిల్ కెరీర్లోనే హిట్ గా నిలిచిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా నేడు ఓటిటిలో ప్రసారం అవుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి కళ్లుచెదిరే విరాళం.. ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలు..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!