వర్షంలోనూ తగ్గని ‘పెద్దన్న’ జోరు

దీపావళికి విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

Read Also : బ్రేకింగ్ న్యూస్: దర్శకుడు రాంగోపాల్ వర్మ కిడ్నాప్..

దీపావళి సందర్భంగా నవంబర్ 4 ప్రపంచవ్యాప్తంగా 1,000 స్క్రీన్లలో విడుదలైంది. మొదట్లో విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. అయితే రోజులు గడిచే కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ ‘పెద్దన్న’ను చూసేందుకు క్యూ కడుతున్నారు. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం తమిళనాడులోనే 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన ‘అన్నాత్తే’లో రజనీకాంత్, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు , ప్రకాష్ రాజ్, సూరి, అభిమన్యు సింగ్, జగపతి బాబు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ‘అన్నాత్తే’కి డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

Related Articles

Latest Articles