మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో లండన్ లో జరగనుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించడానికి కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్‌ని ఎంపిక చేశారట. ఇటీవల విడుదలై హిట్ అయిన శివకార్తికేయన్ ‘డాక్టర్’లో విలన్ గా అందరినీ ఆకట్టుకున్నాడు వినయ్‌రాయ్. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో ఇదే బ్యానర్ లో వరుణ్ ‘తొలి ప్రేమ’ వంటి హిట్ సినిమా చేసి ఉన్నాడు. మార్చిలో ప్రారంభమైన ఈ చిత్రం పూజకు వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ హాజరయ్యారు. వరుణ్ తల్లి పద్మజ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగబాబు క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటించనుంది.