కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు స్టార్ హీరోల హీరోలకు కూడా ఈ కేసుతో ఫిట్టింగ్ పెట్టారు. 2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన “మిస్టర్ లోకల్” అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఆఫర్ చేశారు నిర్మాతలు. కానీ ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లిందలేదట. అందుకే ఇప్పుడు “మిస్టర్ లోకల్” సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై శివకార్తికేయన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు రెబల్, చియాన్ 61, పాతు తాలా పేరుతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో నిర్మాత జ్ఞానవేల్ రాజా పెట్టుబడులు పెట్టకుండా నిరోధించాలని, ఈ మూడు సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ లేదా ఆయా సినిమాలకు సంబంధించి ఎలాంటి హక్కులను అమ్మకుండా నిషేధించాలని శివకార్తికేయన్ కోర్టును కోరారు. ఈ కేసు గురువారం విచారణకు రానుంది.
Read Also : NTR : మాటల్లో చెప్పలేను అంటూ తారక్ స్పెషల్ నోట్
సమాచారం మేరకు శివకార్తికేయన్ ఫిర్యాదు మేరకు 2018 జూలై 6న “మిస్టర్ లోకల్” సినిమాను ఒప్పుకునే ముందే నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం శివకార్తికేయన్ రెమ్యునరేషన్ రూ.15 కోట్లు సినిమా విడుదలకు ముందే చెల్లించాలి. అయితే ఈ చిత్రం 2019 మే 27న విడుదల కాగా, ఆ సమయానికి నిర్మాత రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లు చెల్లించలేదని శివకార్తికేయన్ పేర్కొన్నారు. బ్యాలెన్స్ అమౌంట్ ను ఇవ్వాలని అడిగినప్పటికీ, నిర్మాత స్పందించలేదని శివకార్తికేయన్ ఆరోపించారు. ఇదంతా ఎక్కడ మొదలైందంటే… శివకార్తికేయన్ సినిమాకు తీసుకున్న రూ. 11 కోట్ల రెమ్యూనరేషన్ కోసం నిర్మాత టిడిఎస్‌ను చెల్లించలేదు. దీంతో శివకార్తికేయన్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. వారి నోటీసును సవాలు చేస్తూ శివకార్తికేయన్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయినప్పటికీ ఆయన రూ.91 లక్షలు కట్టక తప్పలేదు. దీంతో శివకార్తికేయన్ ఈ కేసును దాఖలు చేశారు.