Sitara: నాన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్… కూతురు జ్యూవెలరీ యాడ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోల కన్నా ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ చేసే హీరో ఎవరు అంటే వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేష్ బాబు’. ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేష్ బాబు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ తో టైఅప్ అయ్యి తన మార్కెట్ వేల్యూ పెంచుకుంటూ ఉంటాడు. క్లోతింగ్ నుంచి కూల్ డ్రింక్స్ వరకూ రకరకాల బ్రాండ్స్ మహేష్ లిస్టులో ఉన్నాయి. తండ్రిని ఫాలో అవుతూ సితార ఘట్టమనేని కూడా బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది. ఇప్పటికే ఇన్స్టాలో పోస్టులతో డబ్బులు బాగానే సంపాదిస్తున్న సితారా, ఇప్పుడు ఒక ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. రీసెంట్ గా ముంబైలో మహేష్ బాబు, నమ్రతల సమక్షంలో మూడు రోజుల పాటు ఈ జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా చేసారు.
సితార షూటింగ్ లో పాల్గొన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పీఆర్ టీమ్ పోస్ట్ చేసారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు అత్యున్నత టెక్నీషియన్స్ ఈ యాడ్ ని రూపొందించినట్లుగా సమాచారం. సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్ని’ లిరికల్ సాంగ్ లో సితార డాన్స్ చేసి అలరించింది. ఆ తర్వాత కూడా ఒక యాడ్ లో మహేష్-నమ్రతలతో కలిసి కనిపించింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ పోస్ట్ చేసే దగ్గర నుంచి సితార ఒక జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ అయ్యే వరకూ రావడం గొప్ప విషయమే. పీఆర్ టీమ్ పోస్ట్ చేసిన ఫోటోలని వైరల్ చేస్తూ ఘట్టమనేని అభిమానులు తండ్రికి తగ్గ కూతురు అంటూ సితారపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ జ్యూవెలరీ యాడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది చూడాలి.
Also Read
Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! Proud parents Mahesh Babu and Namrata are overjoyed!
Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/ItkANNeaUQ
— Vamsi Kaka (@vamsikaka) May 26, 2023
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!