Sita Ramam: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. గత నెల రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలోని వీడియో సాంగ్స్, డిలీటెడ్ సీన్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్.. ఇక తాజాగా మరో డిలీటెడ్ సీన్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మొదటి నుంచి విష్ణు శర్మ( సుమంత్) కు లెఫ్టినెట్ రామ్ అంటే నచ్చదు. అసూయ అని కొన్ని సీన్స్ లో చూపించారు. వారిద్దరూ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడినప్పుడు.. వారిని చిత్ర హింసలకు గురిచేస్తూ ఉంటారు. ఆ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ జనరల్ తారిఖ్( రష్మిక తాత) వారిని ఇండియా పంపించడానికి కష్టపడుతూ ఉంటాడు. ఆ సమయంలో రామ్, విష్ణు శర్మలో ఎవరో ఒకరీనే పంపించాలనప్పుడు వారిద్దరి మధ్య జరిగే గొడవను డిలీట్ చేశారు.
రామ్, విష్ణు శర్మ బయటికి వచ్చి ఫుట్ బాల్ ఆడడం, అందులో కూడా విష్ణు శర్మ గెలవడంతో.. రామ్.. ఈసారి కూడా మీరే గెలిచారు అని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన విష్ణు శర్మ.. రామ్ కాలర్ పట్టుకొని నేనెక్కడ గెలిచాను రా .. అంతా నీ వలనే జరిగింది.. నువ్వు అనాథవు రా.. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ ఫైర్ అవుతాడు. ఈ సీన్ సినిమాలో పెట్టి ఉంటే ఇంకా బావుండేది అంటున్నారు అభిమానులు. సుమంత్ తన కుటుంబంపై ప్రేమ, దీని అంతటికి కారణం రామ్ అనే కోపాన్ని ఒకేసారి చూపించాడు. ఈ సీన్ లో ఆయన నటన అద్భుతంగా కనిపించింది. లెంత్ ఎక్కువ అవ్వడంతో ఈ సీన్ ను కత్తిరించేసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ సీన్ ఉన్నా.. లేకున్నా విష్ణు శర్మకు రామ్ అంటే అసూయ, కోపం ఉందని అందరికి తెల్సిందే అంటున్నారు అభిమానులు.