టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్‌లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయించింది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతున్న సునీతపై కొందరు ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ఆమె భర్తను దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేశాడు. దీంతో సునీత కూడా అతని స్టైల్ లోనే అతనికి సమాధానం చెప్పింది.
Read Also : ‘రాధేశ్యామ్’ రన్ టైం ఎంతంటే ?
తాజాగా సునీత, రామ్ వీరపనేని సమానత్వానికి మారుపేరుగా ఆవిష్కరిస్తున్న రామానుజులు విగ్రహాన్ని సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ
‘ అంటూ సునీత ఈ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ పిక్ ను చూసిన ఓ నెటిజన్ మాత్రం కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం, గానం ఈవిడది దర్జా అతనిది
అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన సునీత ‘నోటి దూల నీది. నీ భారం భూమిది’ అంటూ అతని స్టైల్ లోనే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. నెటిజన్ చేసిన కామెంట్, సునీత ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.