Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య నడుస్తున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుపై వస్తున్న వార్తల నేపథ్యంలో పంజాగుట్ట సీఐ రామకృష్ణ స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ వివాదానికి మూలమని భావిస్తున్న ఫైనాన్స్ స్కామ్ గురించి సీఐ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు మాకు ఫైనాన్స్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదు. అంతేకాకుండా, బాధితులుగా చెప్పుకుంటున్న వారు ఎవరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రారు” అని స్పష్టం చేశారు. సింగర్ మంగ్లీ తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే, ఆదివారం నాడు సింగర్ మంగ్లీ కూడా అడ్వకేట్ సుబ్బారావుపై తిరిగి ఫిర్యాదు చేశారు.
Also Read : Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఇక ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు కొంతమంది బాధితులతో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. “సుబ్బారావు స్టేషన్‌కు వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఆల్కహాల్ వాసన రావడాన్ని నేను గమనించాను. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా తక్షణమే ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ఆదేశించాను” అని తెలిపారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో సుబ్బారావుకు 27 ఎంజి ఆల్కహాల్ శాతం నమోదైనట్లు సీఐ ధృవీకరించారు. ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్న సమయంలో సుబ్బారావు మీడియా సమక్షంలోనే హంగామా సృష్టించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రెండు వైపుల ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..