Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aayan: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అంటూ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో అయాన్ పాల్గొని మాట్లాడుతూ.. నా పేరు అయాన్. మాది వైజాగ్. అక్కయ్యపాలెంలో పెరిగాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి తెలుగు సినిమాలో హీరోగా నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇది నా తొలి చిత్రం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ సినిమా చేయలేదు. అలాంటి ప్రత్యేకమైన చిత్రానికి నేను హీరో అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్.. అని అన్నారు. అనంతరం అహల్యా బమ్రూ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ‘గౌరీ’ పాత్రను పోషిస్తున్నాను. మాది పుదుచ్చేరి . వైజాగ్ చూస్తుంటే నాకు పాండిచ్చేరి గుర్తొస్తుంది. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. ‘సింగ్ గీతం’లో నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయడం ప్రతి నటుడి కల. ఈ సినిమాతో నా ఆ కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Prabhas : 'ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే'.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
- Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్
- Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
- Mollywood : ఫీమేల్ సెంట్రిక్ ఇండస్ట్రీహిట్ చిత్రాన్ని బీట్ చేయలేకపోతున్న మాలీవుడ్ స్టార్స్
తాజావార్తలు
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
-
Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
-
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?