Sai Dharam Tej: భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇదేదో సినిమా కథ కాదు.. తేజ్ లో వచ్చిన కొత్త మార్పు కథ. యాక్సిడెంట్ అయ్యిన దగ్గరనుంచి తేజ్ మీడియాకు చాలా దూరంగా ఉన్నాడు. ఆయనలో అప్పటికన్నా.. ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తుంది. ఒక ముఖంలోనే కాకుండా అలవాట్లలో కూడా మార్పు వచ్చింది. ఈ మధ్య తేజ్ .. చేతికి మాల ధరించి కనిపిస్తున్నాడు. ఎక్కడికి వచ్చినా రుద్రాక్ష మాలతోనే కనిపిస్తున్నాడు. యాక్సిడెంట్ లో తేజ్ గొంతు పోయింది.. దానివలన అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఇది తెలియని నెటిజన్లు.. మందు కొట్టి వచ్చాడని హేళన చేస్తున్నారని, ఆ భయం ఇంకా ఉందని తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ భయం పోవాలనే తేజ్ రుద్రాక్ష మాలను ధరిస్తున్నట్లు తెలుస్తోంది.
Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్.. అసలు కారణం ఇదే..?
ఇక తేజ్ కన్నా ముందు ఇదే రుద్రాక్ష మాలతో సమంత కనిపించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తరువాత మొట్టమొదటిసారి మీడియాకు కనిపించినప్పుడు సామ్ చేతిలో రుద్రాక్ష మాల కనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, భయాన్ని పారద్రోలడానికి ఆమె రుద్రాక్ష మాలను ధరిస్తుందట. ఇక ఇలాంటి జప మాలనే సాయి పల్లవి వద్ద కూడా చూసాం. ఆమె మొదటి నుంచి ఆ మాలతోనే కనిపిస్తుంది. ఇలా వీరు ముగ్గురు తమ భయాలను జయించడానికి తమకు ధైర్యాన్ని ఇచ్చేమాలను ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రుద్రాక్ష మాలను ధరించిన వీరి ముగ్గురు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.