Simran Sister Monal Death Mystery: సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ ఇప్పటికీ ఒకటీ అరా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. కానీ, ఆమె చెల్లెలు మోనాల్ మాత్రం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 21 ఏళ్లకే తనువు చాలించిందనే విషయం ఈ తరం వారికి తెలియదు. మోనాల్ అక్క నట వారసత్వం తీసుకుని ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి కన్నడ మూవీ `ఇంద్రధనుష్`తో మోనాల్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీతో పాటుగా, పలు తమిళ సినిమాల్లో కూడా మోనాల్ నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ `బద్రి`లో చిన్న పాత్ర చేసినా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో `ఇష్టం` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మరిన్ని సినిమాలు సైన్ చేసింది.
Kalpana Daughter: ఈ నటి కూతుర్ని చూశారా.. హీరోయిన్స్ ని మించిన అందం!
కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని చని పోయింది. అప్పటికి మోనాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా ఈ సంఘటన సిమ్రాన్ తో సహా కుటుంబసభ్యులను, సినీ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. అయితే మోనాల్ సూసైడ్ చేసుకోవడానికి కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని అప్పట్లో సిమ్రాన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరై.. అవసరం తీరగానే బ్రేకప్ చెప్పి సదరు కొరియోగ్రాఫర్ మోనాల్ ను దారుణంగా మోసం చేశాడని, ఆ బాధ తట్టుకోలేక మోనాల్ చనిపోయిందని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య మిస్టరీగానే మిగిలి పోయిందనే చెప్పాలి.