191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు… ఈ రికార్డులని క్రియేట్ చేసింది ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు అనే విషయం అప్పటి తెలుగు సినీ అభిమానులందరికీ షాక్ ఇచ్చి ఉంటుంది. 2003 జూలై 9 తెలుగు తెరపై ఒక స్టార్ హీరోని సూపర్ స్టార్ గా మార్చిన రోజు. 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అనే పేరు, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన రోజది. ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ ఇండస్ట్రీకి హానికరం అని ప్రతి ఒక్కరికీ అనిపించిన రోజు జూలై 9. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై వి.దొరస్వామి రాజు నిర్మించిన ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ జూలైకి సింహాద్రి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతుంది ఇలాంటి సమయంలో రీరిలీజ్ అవ్వనుంది అనే మాట నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చింది.
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ ని చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఏ హీరోకి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. రజినీకాంత్ అంతటి వాడు సింహాద్రి సినిమా చూసి “ఈ కుర్రాడు చిన్న వయసులో ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నాడు ఏంటి?” అన్నాడు అంటే సింహాద్రి సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ ని ఏ రేంజులో ప్రెజెంట్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. సింహాద్రి అప్పన్న గుడి దెగ్గర ఓపెన్ అయ్యి కేరళ వెళ్లి అక్కడ నుంచి గోదావరి పుష్కరాలకి వచ్చి రాజమౌళి ఇచిన ఇంటర్వెల్ బ్లాక్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెరపై సింగమలై అన్నా అనే అరుపు వినగానే థియేటర్స్ లో ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ వస్తాయి.
హెవీ యాక్షన్ ఎపిసోడ్ జరగుతున్న సమయంలో భూమికతో ఎన్టీఆర్ పోడిపించి రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమా ఎండింగ్ ని సింహాద్రికి ఇంటర్వెల్ కే చూపించాడు. సింహాద్రి ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత ఆడిటోరియం మొత్తం సైలెంట్ అయిపొయింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆంధ్రా సింహాద్రి కాస్త కేరళ సింగమలైగా మారి అక్కడి రౌడీలని ఎదిరించి, అక్కడ డాన్ గా ఎదిగే విధానం సూపర్ ఉంటుంది. నాటు నాటు సాంగ్ తో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న కీరవాణి, సింహాద్రి టైటిల్ సాంగ్ ని అద్భుతంగా ఇచ్చాడు. ఈ టైటిల్ సాంగ్ కి, రాజమౌళి టేకింగ్ కి, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో రచ్చ చేశారు. మరోసారి ఇలాంటి రచ్చనే చెయ్యడానికి ఎన్టీఆర్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. సింహాద్రి సినిమా 4K వర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజున సింహాద్రి సినిమా రీరిలీజ్ అవ్వనుంది.
Get ready to witness the mad ephuroia of our #GlobalStar #ManOfMasses @tarak9999 Anna #Simhadri in the best ever quality. #Simhadri4K Ultra HD, Dolby Atmos 5.1 Loading… 🔥🔥🔥 pic.twitter.com/dgCRNtC6mu
— Nandipati Murali (@NtrMurali9999) March 30, 2023