Site icon NTV Telugu

OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..

Og

Og

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మీరు పవన్ కల్యాణ్‌ కాదు.. గాలి తుఫాన్ అంటూ తన ట్వీట్ కు పవన్ ను ట్యాగ్ చేశాడు సిద్దు. ఇంకేముంది ఈ ట్వీట్ కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. సిద్దు కూడా పవన్ కు అభిమాని అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : OG : తెలంగాణలో ఓజీ ప్రీమియర్స్.. టికెట్ రేట్ల పెంపు

ఓజీ ప్రమోషన్లలో పవన్ కల్యాణ్‌ పాల్గొనట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న హైప్ చాలు కాబట్టి.. కొత్తగా హైప్ పెంచితే అంచనాలకు సినిమాను మించిపోతాయని మూవీ టీమ్ భయపడుతోంది. అందుకే పవన్ ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. కేవలం మూవీ టీమ్ మాత్రమే ప్రమోషన్లు చేయబోతోంది. ఇక ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారంట. ఇందులో కూడా హైప్ ను పెంచే అంశాలు ఏవీ చూపించకుండా నార్మల్ గానే కట్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఎక్కడ పెడుతారు, ఎప్పుడు పెడుతారు అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్

Exit mobile version