Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తాజాగా నటించిన మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ తనపై వస్తున్న కొన్ని రూమర్లపై స్పందించారు. ఈ మూవీలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు. మొదటి నుంచి వైష్ణవినే హీరోయిన్ గా అనుకున్నట్టు తెలిపారు.
Read Also : MK Stalin: ప్రధాని మోడీ కార్యక్రమానికి స్టాలిన్ గైర్హాజరు.. కారణం ఇదే..
ఇక తనకు బొమ్మరిల్లు భాస్కర్ కు క్రియేటివ్ డిఫరెన్స్ విషయంలో గొడవలు అయ్యాయన్న వార్తలు నిజమే అన్నారు. ప్రతి సినిమా విషయంలో ఇది కామన్ గానే జరుగుతుందని క్రియేటివ్ విషయంలో తామిద్దరం కొట్టుకునే దాకా వెళ్లామన్నారు. అంతిమంగా సినిమా ఔట్ పుట్ బాగా రావాలన్నదే తమ టార్గెట్ అని వివరించారు. క్రిటియేవ్ మీద తనకు పట్టు ఉండటం వల్లే సినిమా విషయంలో తాను ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవ్యక్తిని కాదన్నారు సిద్ధు జొన్నలగడ్డ. జాక్ సినిమా కూడా యూత్ ను ఎంటర్ టైన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ మూవీలో కథ, స్క్రీన్ ప్లేతో కొత్త అనుభూతి పొందుతారని ఆయన తెలిపారు.