యంగ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల మ్యారేజ్ రీసెంట్ గా జైసల్మేర్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబై తిరిగి వచ్చిన ఈ కొత్త జంట, బాలీవుడ్ కి గ్రాండ్ రిసెప్షన్ ని అరేంజ్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ రిసెప్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ ఫోటోస్ లో కియారా, సిద్ ఎఫోర్ట్ లెస్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఫోటోస్ లో కనిపిస్తుంది. కియారా అద్వానీ బ్లాక్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా ఉంది.
అజయ్ దేవగన్, కాజోల్, వరుణ్ ధావన్ అండ్ వైఫ్, అలియా భట్, కరణ్ జోహార్ విత్ కరీనా కపూర్ ఖాన్, దిశా పటాని, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్, సిద్దార్థ్ రాయ్ కపూర్, ఆకాష్ అంబానీ, రాకుల్ ప్రీత్ సింగ్, ఇషాన్ కట్టర్, కృతి సనన్, రన్వీర్ సింగ్, విద్యా బాలన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అనుపమ్ ఖేర్ లాంటి స్టార్స్ సిద్ కియారా రిసెప్షన్ కి వచ్చి ఈ ఈవెంట్ ని స్పెషల్ గా చేశారు. ఆల్మోస్ట్ బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అంతా ఒకటే చోట ఉండడంతో బీ-టౌన్ అంతా స్టార్స్ స్టడెడ్ ఫోటోస్ లో కళలాడుతోంది. ఇదిలా ఉంటే కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. ఈ బ్రేక్ కంప్లీట్ అవ్వగానే కియారా అద్వానీ సాంగ్ షూటింగ్ కోసం RC 15 సెట్స్ జాయిన్ అవ్వనుంది. ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ మార్చ్ 17న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.