Site icon NTV Telugu

బాలయ్యనే పక్కన పెట్టిన శృతిహాసన్.. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతోందిగా!

టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది శృతి హాసన్ . ఇప్పటికే సాలార్ షూటింగ్ లో బిజీగా ఉన్న అమ్మడు ఇటీవలే బాలయ్యతో బంపర్ ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించిన ఐదు రోజుల తర్వాత శృతి హాసన్ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. స్పందించడం పక్కన పెడితే.. కేవల్మ్ డైరెక్టర్ పేరును మాత్రమే మెన్షన్ చేసి బాలయ్య పేరును విస్మరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గోపీచంద్ మలినేనితో మూడో సారి పనిచేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసిన అమ్మడు.. బాలకృష్ణ నేమ్ ని ప్రస్తావించలేదు. ఆమె మర్చిపోయి అలా చేసిందా..? కావాలనే చేసిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై బాలయ్య అభిమానులు గుర్రుమంటున్నారు. మర్చిపోయి చేస్తే వెంటనే సరిదిద్ది బాలకృష్ణ నేమ్ ని యాడ్ చేసేది కదా కావాలనే బాలయ్య పేరును యాడ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్స్ సైతం ఈ విషయంలో శృతికి హెచ్చరికలు జారీచేస్తున్నారు. శృతి .. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతోంది.. అని కొందరు.. బాలయ్య సంగతి పాపకి ఇంకా తెలియలేదేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version