బాలయ్యతో సినిమా కోసం శృతికి షాకింగ్ రెమ్యూనరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ చిత్రం కోసం శృతి హాసన్ కు మేకర్స్ రెమ్యునరేషన్‌గా 2 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం. గోపీచంద్ మలినేని శృతికి ‘క్రాక్’తో తెలుగులో మంచి రీఎంట్రీ హిట్ ను ఇచ్చాడు. ఈ చిత్రంలో కూడా ఆమె కోసం మరోసారి మంచి పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతుండగా, వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?