Shriya Sharan: అందాల భామ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్ప్పుడే ఆండ్రీ కోషివ్ ను వివాహమాడి సినిమాలకు కొత్త గ్యాప్ ఇచ్చింది. ఇక వీరికి రాధా అనే కూతురు ఉంది. ఆమెను ఏడాది వయస్సులో ఉన్నప్పుడు అభిమానులకు పరిచయం చేసింది. అప్పటివరకు శ్రియకు కూతురు ఉంది అనేది కూడా తెలియలేదు. అయితే బిడ్డ పుట్టాక తాను కొద్దిగా బరువు పెరిగానని.. ఆ తరువాత యోగా, వర్క్ అవుట్స్ తో మునుపటి రూపానికి వచ్చానని, అందుకే ఇప్పుడు చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక నిత్యం భర్త, రాధతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది శ్రియ.
Adipurush: థియేటర్ లో హనుమంతుని సీటు ఎలా ఉందో చూడండి
ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క రాధ ఆలనాపాలనా చేస్తూ ఉంది.రాధతో పాటు వెకేషన్ లో ఎంజోత్ చేయడమే తప్ప ఆమె ముఖాన్ని ఎప్పుడు దగ్గరనుంచి చూపించింది లేదు. ఇక తాజాగా రాధ ముఖాన్ని చూపించింది శ్రియ. ఆమె మొట్టమొదటి సారి స్కూల్ కు వెళ్తున్న ఫోటోను షేర్ చేసి.. రాధ స్కూల్ కు వెళ్తోంది అని చెప్పుకొచ్చింది. అంతేకాకూండా కూతురును.. భార్యాభర్తలు ఇద్దరు దగ్గర ఉండి స్కూల్ వద్ద దింపి .. ఆమె స్కూల్ కు వెళ్తుంటే.. అలా చూస్తూ ఉండిపోయే ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఫోటో చూసిన అభిమానులు. ఏంటి రాధ అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా..? అస్సలు ఊహించనే లేదు అని కొందరు. శ్రియకు స్కూల్ కు వెళ్లే డాటర్ ఉందా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.