Shreya Dhanwanthary : సినిమాల్లో ముద్దు సీన్లు ఈ నడుమ చాలా కామన్ అయిపోయాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాల దగ్గరి నుంచి కొత్త హీరోల మూవీల దాకా.. ముద్దు సీన్లు కంటెంట్ లో లేకున్నా ఇరికించి మరీ పెట్టేస్తున్నారు. తాజాగా ముద్దు సీన్ ను తొలగించారని బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది. ఈ మూవీలోని 33 సెకన్ల ముద్దు సీన్ ను సెన్సార్ బోర్డు కట్ చేసింది. దానిపై శ్రేయా ఫైర్ అయింది. ఇలా ముద్దు సీన్ ను కట్ చేయడం ఏంటని మండిపడింది ఈ బ్యూటీ. ఇలాంటి పనుల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అని ప్రశ్నించింది.
Read Also : Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
ప్రేక్షకులు ఏమీ చిన్నపిల్లలు కారని.. వాళ్లు ఏం చూడాలో కూడా సెన్సార్ బోర్డే చెప్పేస్తుందా అంటూ ప్రశ్నించింది శ్రేయా. ఈ రోజుల్లో సినిమాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ఓ వైపు పైరసీ, ఇంకోవైపు లీకులు కూడా ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గిపోయింది. ఇలాంటప్పుడు సెన్సార్ బోర్డు కత్తిరింపులు ఎక్కువైతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఎలా అంటూ ప్రశ్నించింది శ్రేయా ధన్వంతరి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?