బాలీవుడ్ లో ప్రస్తుతం బ్రేకప్ ల పరంపర నడుస్తుందా అన్నట్లు ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఒకరి తరువాత ఒకరు బంధాలను తెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు జంటలు తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ప్రేమ జంటలు కూడాబ్రేకప్ ప్రకటించి మళ్లీ సింగిల్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పి సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా అని ప్రకటించింది.
ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. సాహో చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది గోవాలో అమ్మడి బర్త్ డే వేడుకల్లో రోహన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముచ్చటైన ఈ జంటను చూసి త్వరలోనే వీరిద్దరూ వివాహంతో ఒక్కటవ్వుతారు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ జంట విడిపోయినట్లు వస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. అయితే ఈ జంట బ్రేకప్ కి సరైన కారణాలు అయితే తెలియరాలేదు కానీ .. బాలీవుడ్ లో మాత్రం ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో విడిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల రోహన్, శ్రద్దా గురించి కానీ, ఆమె, అతడి గురించి కానీ మాట్లాడింది లేదు, బయట ఎక్కడ కనిపించింది లేదు. దీంతో ఈ జంట విడిపోయినట్లు కన్ఫర్మ్ చేసేశారు వీబోలీవుడ్ వర్గాలు. మరి ఈ వార్తలపై ఈ జంట స్పందిస్తారో లేదో చూడాలి.