Shooting Updates of Tollywood Movies: టాలీవుడ్ లో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివారులో నిర్మించిన గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం చేస్తున్నారు. మరొక పక్క నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా హైదరాబాద్ శివార్లలో ఉన్న బీహెచ్ఈఎల్ లో జరుగుతోంది.
Love Mouli: పాన్ ఇండియా లెవల్ రియల్ లవ్ స్టోరీ.. షీఈజ్ రియల్ అంటున్న లవ్ మౌళి
అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన ఒక భారీ సెటప్ సిద్ధం చేశారు. పాకిస్తాన్ లో జరిగినట్లుగా చెప్పబడుతున్న కథ షూటింగ్ అక్కడ జరుగుతోంది. మరొక పక్క ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. పరశు రామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ల మీద జరుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు జహీరాబాద్లో జరుగుతోంది. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్లో జరుగుతోంది. సిద్దు జొన్నలగడ్డతో పాటు ఇతరుల మీద ఉన్న కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఇక అంతేకాక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాగర్ చంద్ర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న టైసన్ నాయుడు సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో జరుగుతోంది.