Site icon NTV Telugu

RC15: పొలిటీషియన్ గా చరణ్.. లీకైన ఫోటో వైరల్

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ ఫోటో లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వైట్ కలర్ పంచెలో సైకిల్ ఎక్కి తొక్కుతున్న చరణ్ ఫోటో లీక్ అయ్యింది. సాంప్రదాయ పంచె కట్టు, పక్క పాపిడి, చేతికి నల్ల కాశీ తాడు.. వైట్ అండ్ వైట్ లుక్ లో హ్యాండ్ మడత పెట్టి ఒక సాధారణ గ్రామ సర్పంచ్ లా కనిపిస్తున్నాడు.  ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఒకటి స్టూడెంట్ గా.. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని మొన్నటివరకు అంటున్నా ఇప్పుడు మాత్రం తండ్రీకొడుకులుగా చరణ్ కనిపించబోతున్నాడట.  అయితే ఈ ఫొటోలో చరణ్ పక్కా పొలిటీషియన్ గా కనిపిస్తున్నాడు. 1980 లో ఒక ఫ్లాష్ బ్యాక్ ను శంకర్ తెరక్కిస్తున్నాడట.. అందులో చరణ్  ఒక రాజకీయ నాయకుడిగా నటిసున్నట్లు సమాచారం. తండ్రి బాటలోనే యంగ్ చరణ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ నుంచి పొలిటీషియన్ గా మారతాడట.  మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ ఫోటోను మాత్రం చరణ్ ఫ్యాన్స్ వైరల్ గా మార్చేశారు.

Exit mobile version