శోభిత దూళిపాళ..ఈ పేరు కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు.. బాలివుడ్ లో హవాను కొనసాగిస్తుంది.. నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది..30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి..
గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.. ఈ అమ్మడు ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ తో కెరీర్ మంచి జోరు మీద ఉంది. చివరగా ఈ హాట్ బ్యూటీ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో నటించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ది నైట్ మ్యానేజర్ తో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది..
ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. అతడి భార్యగా శోభిత మెరిసింది. రీసెంట్ గా రెండవ భాగం ది నైట్ మ్యానేజర్ 2 కూడా స్ట్రీమింగ్ మొదలైంది. జూన్ 30 నుంచి పార్ట్ 2 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. శోభిత శృంగార సన్నివేశాలు.. యువతకు నిద్రలేకుండా చేస్తున్నాయి.. తాజాగా గ్రీన్ శారీలో మెరుపులు మెరిపిస్తూ పరువాల వరద పారించింది.కంప్లీట్ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో శోభిత ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.. ఈ పిక్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి..