Shivani Rajasekhar Reveals reason behind rejecting Bebamma role of Uppena Movie: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టికి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంది అయితే అవి పెద్దగా ఆడటం లేదు అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి చేసిన బేబమ్మ పాత్ర తాను చేయాల్సిన పాత్రని కానీ తాను చేయకుండా వదిలేశానని తాజాగా శివాని రాజశేఖర్ చెప్పుకొచ్చింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఇప్పటికీ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఆమె నటించిన కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో బేబమ్మ పాత్ర గురించి ఆమె బయట పెట్టింది.
Varun Tej: కొత్త భార్యపై దుష్ప్రచారం.. అందరి నోళ్లు మూయించిన వరుణ్ తేజ్
తాను ఉప్పెన సినిమా చేయాల్సి ఉంది కానీ తనకు నేరేషన్ కోసం ఇచ్చిన డ్రాఫ్ట్ అలాగే సినిమా ఫైనల్ వెర్షన్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. తనకు నేరేషన్ ఇచ్చేటప్పుడు తనకు చెప్పిన కథలో చాలా బోర్డ్ ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని ఆ సమయంలో తాను ఆ సీన్స్ చేయడానికి కన్విన్స్ అవ్వలేదని, తనకు అలా ఇంటిమేట్ సీన్స్ చేయడం కంఫర్టబుల్ అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఆ కారణంతో తాను బేబమ్మ పాత్ర చేయలేనని చెప్పగా అది అటు తిరిగి ఇటు తిరిగి కృతి శెట్టి దగ్గరికి వెళ్లిందని చివరికి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకొచ్చింది. తనకు ఫైనల్ వెర్షన్ వినిపించి ఉంటే బహుశా చేసి ఉండే దాన్నేమో అలా చేసి ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదేమో అని ఆమె కామెంట్ చేసింది.