Kotabommali : కోటబొమ్మాళి రీమేక్ కాదు.. కీలక విషయాలు చెప్పిన శివాని రాజశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivani Rajasekhar Exclusive Web Interview for Kotabommali PS Movie: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియా మిత్రులతో ఈ విధంగా ముచ్చటించారు.
ఈ ప్రాజెక్టులో మీరు ఎలా భాగమయ్యారు ?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ఆర్టికల్ 15’ తమిళ్ రీమేక్ లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు, ‘ఆర్టికల్ 15లో ట్రైబల్ అమ్మాయి పాత్ర పోషించా, ఇందులో అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు, షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నానని అన్నారు.
ఈ సినిమా ఒరిజినల్ నాయాట్టు చూశారా?
ఈ ఆఫర్ వచ్చిన తర్వాత ఒరిజినల్ వెర్షన్ చూశా, విలేజ్ లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం, అలాగే నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో వారి నుంచి తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా, ఈ సినిమా విషయంలో నా గెటప్ కోసం నాన్న కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు.
లింగిడి లింగిడి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు?
ఈ పాట ఇంత వైరల్ కావడం చాలా హ్యాపీగా ఉంది, ప్రతి ఆర్టిస్ట్ కి తన సినిమా బాగుండాలి, సినిమాలోని పాటలు సక్సెస్ అవ్వాలని కోరిక ఉంటుంది. నాకు ఈ పాటతో ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఈ సాంగ్ వల్ల నాకు మరింత గుర్తింపు వచ్చింది, ఎక్కడికి వెళ్లినా ఈ పాట గురించి మాట్లాడుతున్నారు. అసలు లింగిడి పాట వల్లే కోటబొమ్మాలి సినిమాకు మంచి బజ్ వచ్చింది, ఇంతలా ఈ పాటను జనాల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ కి స్పెషల్ థాంక్స్.
ఒరిజినల్ వెర్షన్ లోని పాత్ర మీపై ఎలా ప్రభావితం చేస్తుంది?
ఒరిజినల్ క్యారెక్టర్స్ తో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను, సినిమాగా చూసి వదిలేస్తాను అంతే తప్ప వారిని ఫాలో అవ్వను ఎందుకంటే ఇమిటేషన్ ఉండకూడదని అనుకుంటా. అయినా ఆ చిత్రానికి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది, ఒరిజినల్ చూసిన వారు కూడా ఈ సినిమాను ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అలా అని ఒరిజినల్ సోల్ కు ఏ మాత్రం తక్కువ ఉండదు.
రీమేక్ చేయడం ఛాలెంజింగ్ కదా..కంపేరిజన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ చిత్రాన్ని మా టీమ్ అంతా ముందు నుంచి రీమేక్ అని నమ్మలేదు, ఆ పాయింట్ తప్ప మిగతా సినిమా అంతా మార్పులు చేశారు.
ఈ సినిమా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నారు?
నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు, మనం ఎంత ఆలోచించినా జరగాల్సిందే జరుగుతుందనే విషయం నాకు బాగా అర్థమైంది. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నను చూసి పెరగడం కూడా నాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడాన్ని నేను నమ్ముతా, అప్పుడు రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కమర్షియల్ రోల్స్ కూడా చేయాలని ఉంది, వాటి కోసం వెయిట్ చేస్తున్నా.
కొత్త కథలు వచ్చినప్పుడు అమ్మానాన్నల సలహాలు తీసుకుంటారా?
నా కథల విషయంలో గానీ శివాత్మిక కథల విషయంలో గానీ వాళ్ళు జోక్యం చేసుకోరు ఎందుకంటే మా పై వారికి నమ్మకం ఉంది. వాళ్ళు ఎప్పుడూ మా కథలు వినలేదు. చివరి నిర్ణయం మాకే వదిలేస్తారు.
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?
శ్రీకాంత్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ గా, డాడీ కి కొలీగ్ నాకు తెలుసు. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆయన చాలా జోవియల్ యాక్టర్, సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను, రాహుల్ చాలా విషయాలు నేర్చుకున్నాం. దర్శకుడికి గౌరవం ఇవ్వడం, టైం కి సెట్ కి రావడం లాంటివి ఎన్నో విషయాలు ఆయనను చూసి నేర్చుకున్నాం, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్ గా ఉంటుంది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!