Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు, బీజీఎంతో యూత్ ప్రేమికులను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది.
Read Also : Ram Charan : అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్.. ఆ బిజినెస్ లోకి అడుగు..?
దీంతో ఆమె టాలీవుడ్ లో నయా పాపులర్ హీరోయిన్ గా అవతరించింది. దెబ్బకు టాలీవుడ్ లో అవకాశాలు పట్టేస్తున్న మీనాక్షి చౌదరి, శ్రీలీల, భాగ్య శ్రీ బోర్సే లు టెన్షన్ పడుతున్నారంట. ఎందుకంటే వాళ్లు ఆల్రెడీ ప్లాపులతో సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీ ఎప్పుడైనా హిట్లు ఉన్న హీరోయిన్లకే అవకాశాలు ఇస్తుంది. పైగా ఈమె నటన పరంగా ప్రూవ్ చేసుకుంది. అందుకే శివానీ ఇప్పుడు పాపులర్ హీరోయిన్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోందంట. మొన్నటిదాకా ఆ ముగ్గురివైపు చూసిన ఇండస్ట్రీ.. ఇప్పుడు శివానీకి వరుసగా అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకో రెండు హిట్లు పడితే మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోవడం ఖాయం.
Read Also : Abhishek Bachchan : అశ్లీల వెబ్ సైట్లలో అభిషేక్ బచ్చన్ ఫొటోలు.. ఏం చేశాడంటే..?
