Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది వైరల్ అయిపోతూనే ఉంది. తాజాగా ఆయన మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫొటోలు అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంట. ఈ విషయంపై ఆయన ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై తన పర్మిషన్ లేకుండానే తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏఐ ద్వారా తన ఫొటోలు జనరేట్ చేసి వాటిని అశ్లీల వీడియోల్లో విచ్చలవిడిగా వాడేస్తున్నారంటూ వాపోయాడు అభిషేక్. కాబట్టి తన పరువుకు భంగం కలుగుతోందని.. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరాడు అభిషేక్.
Read Also : Jaquelin Fernandez : హీరోయిన్ గొప్ప మనసు.. వ్యాధి సోకిన బాబుకు సాయం..
తన ఫొటోలను ఇలా వాడటం వల్ల తన ఫ్యామిలీ సఫర్ అవుతోందని తెలిపాడు అభిషేక్ బచ్చన్. అటు ఐశ్వర్య రాయ్ కూడా ఇదే కోర్టును ఆశ్రయించింది. ఆమె తన పర్మిషన్ లేకుండా కొందరు తన ఫొటోలు, తన కూతురు ఫొటోలు వాడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పర్మిషన్ లేకుండా ఎవరూ ఫొటోలు వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరింది. సెలబ్రిటీలు అన్న తర్వాత వాళ్ల ఫొటోలు, వీడియోలు చాలా మంది వాడేస్తుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. కాకపోతే అభిషేక్ బచ్చన్ ఫొటోలను ఏకంగా అశ్లీల వెబ్ సైట్లకు వాడేస్తున్నారంటూ కంప్లయింట్ పిటిషన్ వేసింది. వీరిద్దరూ విడిపోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది ఈ జంట. ఇప్పుడు ఇద్దరూ ఒకే రకమైన సమస్యతో కోర్టు మెట్లు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.
Read Also : Nayanthara : నయనతార రూ.5 కోట్లు ఇవ్వు.. మరో కాంట్రవర్సీ