బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ షో మూడు వివాదాలు .. ఆరు రహస్యాలతో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వివాదాలు ఎన్ని ఉన్నాయో.. వారి జీవితంలో రహస్యాలు అన్నే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూనమ్ పాండే లాంటి వారు తన జీవితంలోని రహస్యాలను బయటికి చెప్పి ఔరా అనిపించగా.. తాజాగా శివమ్ శర్మ తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని లాకప్ షోలో చెప్పుకొచ్చాడు. “మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది.. ఆమె భర్తను వదిలి విడిగా ఉంటుంది. నేను కాలేజ్ చదివే రోజుల్లో వైట్ సాస్ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెకు నేనంటే చాలా ఇష్టం ఉండేది. అలా మేము ఇద్దరం పడక షేర్ చేసుకున్నాం. ఆమె ఇంటికి వెళ్లిన ప్రతిసారి ఆమెతో శృంగారం చేసేవాడిని.. అయితే ఇందులో ఎవరి బలవంతం లేదు. ఇద్దరికీ ఇష్టమయ్యే ఈ పని చచేశాం. వాడుకొని వదిలేసే టైప్ అయితే కాదు ఆ రిలేషన్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ రహస్యం విన్న మిగతా కంటెస్టెంట్లందరూ షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ గా మారింది.