Shivaji : మంగపతి పాత్ర.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న క్యారెక్టర్. సీనియర్ హీరో కమ్ యాక్టర్ అయిన శివాజీ చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ చేసిన పాత్ర ఇది. కోర్టు సినిమాలో అందరికంటే ఈ పాత్రనే హైలెట్ అయింది. ఒక రకంగా శివాజీ ఇందులో జీవించేశాడు. ఇందులో శివాజీ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగా సెట్ అయ్యాయి. మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో పాటు పాజిటివ్ షేడ్స్ కూడా ఉన్న పాత్రలో నటించాడు శివాజీ. ఇలాంటి పాత్రలు అందరికీ సెట్ కావు. కానీ శివాజీ కోసమే ఈ పాత్ర పుట్టిందేమో అన్నట్టు ఒదిగిపోయాడు.
Read Also : AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..
ఈ పాత్ర చూసిన వారందరికీ ఎక్కువగా విజయ్ సేతుపతి గుర్తుకు వస్తాడేమో. ఎందుకంటే విజయ్ కూడా ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు. క్లాసిక్ నెగెటివ్ షేడ్స్ పాత్రల్లో నటించే తెలుగు వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందుకే ఇలాంటి పాత్రలకు ఎక్కువగా తమిళ విజయ్ సేతుపతికే వెళ్తుంటాయి. ఇప్పుడు శివాజీ రూపంలో టాలీవుడ్ కు మరో విజయ్ సేతుపతి దొరికినట్టే అంటున్నారు. యంగ్ గా కనిపించడంతో పాటు విలనిజం, డ్రామా ఒకేసారి చూపించే వాళ్లు టాలీవుడ్ లో లేరు. ఆ లోటు శివాజీతో తీరినట్టే అంటున్నారు సినిమా నిపుణులు. శివాజీ కూడా తనకు మంగపతి పాత్రలు ఇంకా కావాలని అంటున్నారు. సాఫ్ట్ కార్నర్ పాత్రలు వద్దని.. ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలే కావాలని స్టేజిల మీదనే అంటున్నారు. కాబట్టి మరో విజయ్ సేతుపతిగా శివాజీ రాణిస్తాడేమో చూడాలి.