Shivaji : నటుడు శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐ బొమ్మ రవి కేసు తర్వాత ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్లు, టికెట్ రేట్లపై ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. వీటిపై శివాజీ స్పందించాడు. ‘అందరూ అనుకుంటున్నట్టు సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలు, డైరెక్టర్లకు భారీగా రెమ్యునరేషన్లు లేవు. అందరు నిర్మాతలకు భారీగా లాభాలు రావట్లేదు. కేవలం 5 శాతం మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు భారీగా డబ్బులు వస్తున్నాయి. వాళ్లకే రెమ్యునరేషన్లు భారీగా ఉంటున్నాయి. లాభాలు ఎక్కువగా వస్తున్నాయి.
Read Also : Rakul Preet : వాళ్లను నమ్మొద్దు.. రకుల్ ప్రీత్ ట్వీట్
మిగతా 95 శాతం మంది సాదా సీదాగానే గడుపుతున్నారు. ఆ ఐదు శాతం మంది వల్లే మిగతా వారికి ఎఫెక్ట్ పడుతోంది. వాళ్లను చూసి మిగతా వారందరినీ తిట్టడం కరెక్ట్ కాదు. నేను పైరసీకి వ్యతిరేకమే. తప్పు ఎవరు చేసినా తప్పుగానే చూస్తాను. ఐ బొమ్మ రవి చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ అతని ట్యాలెంట్ మన దేశానికి ఉపయోగపడాలి. అది ఏదో ఒక విధంగా ఉపయోగిస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెరిగితే అందరూ తిట్టుకుంటారు. కానీ పండగల పూట బస్ ఛార్జీలు పెరిగితే ఎవరూ పట్టించుకోరు అన్నాడు శివాజీ.
Read Also : I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి