Shilpa Reddy Birthday Celebrations : ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తన బర్త్‌డే వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో లక్ష్మి మంచు, లావణ్య త్రిపాఠి, సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్ఎమ్, మెగా సిస్టర్స్ నిహారిక, సుస్మిత, శ్రీజ సందడి చేశారు. శిల్పా రెడ్డి ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ప్రశాంతంగా డిన్నర్ చేయాలనుకున్నా… ప్రీ బర్త్ డే సెలబ్రేషన్ గా మారింది. ముసిముసి నవ్వులతో అమ్మాయిల సందడితో సరదాగా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సోషల్ మీడియా సంచలనం నీహారిక కలవటం తన గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడం వెరే లెవెల్. ఇది ఓ రకంగా నిశ్శబ్ద విందుగా భావిస్తున్నా’ అని తెలియజేసింది. ఇక పార్టీలో అందరూ సరదాగా ఉండటానికి కారణం నిహారిక ఎన్.ఎమ్ అని వారందరూ చెప్పడం గమనార్హం.