NTV Telugu Site icon

Kollywood : సూర్యకు పోటీగా శశి కుమార్.. గెలుపెవరిదో..?

Sura Vs Sasi Kumar

Sura Vs Sasi Kumar

సూరారై పొట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్‌తో పీక్స్‌కు చేరాయి. కానీ కంగువా అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్నీ రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటిని కలిగిస్తోంది.   మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Chiyaan : దశాబ్ద కాలం తర్వాత హిట్ కొట్టిన స్టార్ హీరో..

కానీ సూర్య సినిమాకు పోటీ కాస్త అధికంగా ఉంది. తెలుగులో అదే రోజున నాని హిట్ 3 మూవీ రాబోతుంది. తమిళంలో కూడా సూర్య సోలోగా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ స్టార్ హీరోపై రివేంజ్ తీర్చుకోవడానికి గౌతమ్ వాసు దేవ్ మీనన్ ధ్రువ నక్షత్రం రిలీజ్ అవుతుందని టాక్ వినిపించింది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సో సూర్య కు సోలో రిలీజ్ దొరుకుతుంది అనుకోగా సడెన్లీ రేసులోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ కమ్ హీరో శశికుమార్. సూర్య రెట్రోకు పోటీగా టూరిస్ట్ ఫ్యామిలీని దింపుతున్నాడు శశికుమార్. సిమ్రాన్ హీరోయిన్‌గా నటిస్తుండటం లవర్, గుడ్ నైట్ హిట్ బొమ్మలను నిర్మించిన మిలియన్ డాలర్స్ స్టూడియో ఈ సినిమాను తీయడంతో అంచనాలు పెరిగాయి. శ్రీలంకలో ఓ తమిళ ఫ్యామిలీ ఎదుర్కొంటోన్న కష్టాలను ఫన్నీగా చూపించాడు కొత్త దర్శకుడు అభిషన్ జీవంత్. అయితే సూర్యతో పోటీపడేంత స్టామినా శశికుమార్‌ది కాకపోయినా కూడా తెలిసి పోటీకి దిగడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంటెంట్ ఎంత బాగున్నారిస్క్ చేస్తున్నాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.