కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి సినిమాలలో విక్రమ్. నటన గురించి ఎంత చెప్పిన తక్కువ. సినిమాలైతే ఏడాదికి రెండు మూడు చేస్తున్నాడు కానీ గత దశాబ్ద కాలంగా సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. విభిన్న కథలు, జానర్స్ ట్రై చేసాడు కానీ విజయం మాత్రం దక్కలేదు. ఐ, తంగలాన్ సినిమాల మేకోవర్ కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కానీ విక్రమ్ కు నిరాశే ఎదురైంది.
Also Read : Mega158 : అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
కథలో విషయం లేకపోవడం డైరెక్టర్స్ వైఫల్యం వలన విక్రమ్‌కు విజయాలు వరించలేదు. మధ్యలో మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమా వచ్చిన అది మల్టీస్టారర్ ఖాతాలోకి వెళుతుంది. ఇక పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఇలా దశాబ్ద కాలంగా హిట్ అనే మాట వినలేదు విక్రమ్. అటు అభిమానులు కూడా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు వారి నిరీక్షణకు తెరపడింది. విక్రమ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ వీర ధీర శూరన్. ఈ నెల 27న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. రిలీజ్ రోజు విడుదల విషయంలో కాస్త గందరగోళం జరిగినా మొత్తానికి విక్రమ్ కష్టం ఫలించింది. దర్శకుడు S.U. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలోని కథ, కథనం ఆడియెన్స్ ను విశేషంగా అలరిస్తోంది. కేరళలో ఎంపురాన్ ను తొలగించి మరి వీర ధీర సురన్ కు థియేటర్స్ కేటాయిస్తున్నారు అంటేనే చెప్పొచ్చు విక్రమ్ ఎలాంటి హిట్ కొట్టాడో. మొత్తానికి విక్రమ్ హిట్ కొట్టి ఫ్యాన్స్ కొరక తీర్చారు.