సిద్దార్థ్, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘మహా సముద్రం’. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అజయ్ భూపతి రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో చిత్రంపై వివాదాలూ ముసురుకున్నాయి. ‘రంభ… రంభ’ అనే పాటలో వాడిన పదాలను, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ లోని సంభాషణలను హిందుత్వవాదులు ఖండించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అదితీరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తయ్యిందని శర్వానంద్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.