Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhogi: టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రక్షాబంధన్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తున్న శర్వానంద్ లుక్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భోగి’లో శర్వానంద్ గంగా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన పాత్రలకు భిన్నంగా శర్వా కనిపించబోతున్నారనే వార్తలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రక్షాబంధన్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శర్వానంద్ తన సోదరీమణులతో కలిసి కనిపించారు. చుట్టూ తాటి చెట్లు, మట్టి ఇల్లు, పల్లెటూరి వాతావరణం.. ఇలా మొత్తం పోస్టర్ చూస్తే పాత కాలంలోకి తీసుకెళ్లేలా ఉంది. గ్రామీణ లైఫ్ స్టైల్ ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. ఈ సినిమా కథ కూడా 1960 నాటి కాలంలో సాగుతుందని సమాచారం.
ఇటీవలే ‘భోగి’ భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీంతో సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయినట్లే. తొలుత ఈ సినిమాని రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల రిలీజ్ కు కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీజీ వర్క్ పూర్తవ్వడానికి సమయం పడుతుండటంతో రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం తొందరపడటం లేదని సమాచారం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ‘భోగి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండటంతో యాక్షన్, ఎమోషన్, పీరియడ్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్రబృందం దృష్టి పెట్టింది. సినిమా పూర్తి స్థాయి పనులు ఎప్పుడు ముగుస్తాయనే దానిని బట్టి థియేట్రికల్ రిలీజ్ తేదీని ఆఫీషియల్ గా ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!