BHOGI : ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ భోగీ. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఇచ్చేశారు. మహారాష్ట్ర బార్డర్ లో జరిగే సినిమా అని.. మైథలాజికల్ మూవీ అని.. ఏవేవో చెప్పేశారు. తాజాగా మూవీ ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భోగీ ప్రపంచం ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశారు. హర్రర్ బీజీఎంతో టీజర్ సాగింది. ఇందులో ఓ పాడుబడ్డ ఇంటిని, ఓ చెట్టును చూపించారు. మోర్ వయలెన్స్ అంటూ వందల మంది కత్తులు పట్టుకుని వస్తున్న విజువల్స్ చూపించారు. శర్వానంద్ ను కూడా ఇందులో చూపించారు. కానీ అది సినిమాలోని లుక్ కాదు.
Read Also : STR : సెట్స్ పై అరడజను సినిమాలు.. డిస్కషన్స్ లో మరో రెండు
ఆ సినిమా కథకు ఆయన ఇస్తున్న ఎక్స్ ప్రెషన్ లాగా ఉంది. ఏదో ఆసక్తికర విషయాన్ని ఇందులో చూపించబోతున్నట్టు మొత్తానికి దీన్ని చూపించారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీస్తున్నారు. అనుపమ, డింపుల్ హయతీ ఇందులో నటిస్తున్నారు. ఈ రోజు నుంచే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించాడు సంపత్ నంది. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్ కు రీసెంట్ గా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ భారీ బడ్జెట్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
— https://youtu.be/JGAQw158-wI