Shanthi Williams: ముందే చెప్పి చనిపోయాడు.. శవానికి బాయ్ చెప్పి షూట్ కి వెళ్ళా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shanthi Williams Emotional about Son Death: తమిళ నటి శాంతి విలియమ్స్ కుమారుడు సంతోష్ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే తన కొడుకు చనిపోయాడన్న విషయం కూడా తెలియదని, అతనితో మాట్లాడి షూటింగ్‌కి బయలుదేరానని తన బాధను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. కోయంబత్తూరుకు చెందిన శాంతి విలియమ్స్ 11 ఏళ్ల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె బాలనటిగా అనేక చిత్రాలలో నటించింది. ఆ తరువాత నటిగా మారి తమిళం, మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. ఆమె కెమెరామెన్ విలియమ్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు దూరమై భర్త, పిల్లలతో కలిసి జీవించింది. భర్త విలియమ్స్ మరణం తరువాత, ఆమె ఆర్థిక సంక్షోభం కారణంగా రీ-ఎంట్రీ ఇచ్చింది. సినిమా అవకాశాలు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చి మెట్టి ఓలి సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది.
Manjima Mohan: పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ.. చాలా బాధపడ్డాను- హీరోయిన్ ఆవేదన!!
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
అయితే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను బాధాకరం అంటూ చెప్పుకొచ్చింది. నా భర్త బతికి ఉన్నప్పుడు పెద్ద నటులంతా ఇంటికి వచ్చేవారు, వాళ్లందరికీ నేనే వంట చేసేదాన్ని. మరెవరూ వండకూడదు, నువ్వే వండాలి అనేవారు. అదేవిధంగా షూటింగ్‌కి నేనే నా చేతులతో వండి పంపిస్తాను. అలాంటి పరిస్థితి మారి ఆయన చనిపోయాక ఎవరూ ఇంటికి రాకపోతే ఆ సమయంలో రజనీ సార్ మాత్రమే మాకు సహాయం చేశారు. దానిని నేనెప్పటికీ మరచిపోలేను. కుటుంబ పరిస్థితుల కారణంగా మళ్లీ నటనలోకి వచ్చాను, ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత మెట్టి ఓలి సీరియల్లో అత్తగా నటించాను. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటూ పిల్లలను బాగా చదివించాను.
నా కొడుకు సంతోష్ చనిపోయాడు, ఈ దుఃఖం నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేకపోయాను. నా కొడుకు చనిపోయే ముందు, నేను చనిపోతే అందరినీ చూసుకో అని చెప్పాను. అప్పుడు నా కొడుకు నువ్వు చావవు, నేను చస్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయమే చనిపోయాడు. నాకు తెలియకుండానే అతని కాలు పట్టుకుని హేయ్, నేను షూట్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లాను. అయితే అతను చనిపోయాడని నాకు తెలియదు. ఆ తర్వాత 3 గంటలకు కాల్ వచ్చి సంతోష్ చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు కొడుక్కి దూరంగా ఇలా బతకలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది శాంతి విలియమ్స్.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!